దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది అరెస్ట్..

245
Raghunandan Rao

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు స్వయానా బావమరిది సురభి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని బేగంపేటలో రూ.1 కోటి స్వాధీనం చేసుకోగా, ఈ డబ్బును తీసుకెళుతున్న రఘునందన్‌ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, డ్రైవర్ రవికుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బును తాము దుబ్బాక తీసుకెళుతున్నట్టు సురభి శ్రీనివాసరావు వెల్లడించినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఫోన్ కాల్ లిస్ట్ లో రఘునందన్ రావు కి నేరుగా శ్రీనివాస్ రావు ఫోన్ చేశాడు.

బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ నుంచి ఆ డబ్బును తీసుకుని దుబ్బాక వెళుతున్నట్టు వెల్లడైందని, విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కు చెందినదని అంజనీ కుమార్ వివరించారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇటీవలే సిద్ధిపేటలో రఘునందన్ మామ, ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడూ కృత నిశ్చయంతో వుంటారని సీపీ చెప్పారు.