ఉద్యమంలా గ్రీన్ ఛాలెంజ్..

80
gic
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా కార్తీక మాస వనబోజనాలు పురస్కరించుకుని ఆధిబట్ల లోని వ్యవసాయ క్షేత్రంలో డా.మార్కండేయులు ఆధ్వర్యంలోని వైద్య బృదం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ డా.గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

కార్తీక మాస వన బోజనాలు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని డా.మార్కండేయులు తెలిపారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని డా.గోపీనాథ్ రెడ్డి,డా.మార్కండేయులు అన్నారు.ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డా.సుదర్శన్ రెడ్డి,డా.జాన్సన్,డా.శ్రీనివాస్,డా.రామ్మోహన్ పలువురు వైద్యులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కరుణాకర్ రెడ్డి , రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని వైద్య బృందానికి బహుకరించారు.

- Advertisement -