ఆర్ఆర్ఆర్…గుడ్ న్యూస్..!

95
rrr release date

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా 80 శాతం పూర్తయింది.

కరోనా,లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడటంతో విడుదల తేదీని వాయిదా వేశారు జక్కన్న. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న టైంలో సినిమాను విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

2021 జనవరి 8న సినిమా విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారట రాజమౌళి. ఇందుకు తగ్గట్లుగా పెండింగ్‌లో ఉన్న భాగాన్ని కొంతమేర మార్పు చేసి త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. షూటింగ్స్ ప్రారంభం కాగానే త్వరత్వరగా ఫినిష్ చేసి జనవరి 8నే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందోలేదో తెలియదు గానీ టీ టౌన్‌లో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.