అర్జున్ రెడ్డి సీక్వెల్ చేయ‌నున్నవిజ‌య్….

492
Director wants to do the sequel of Arjun Reddy
- Advertisement -

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లలో మొద‌టి సినిమా పెళ్లి చూపుల‌తోనే ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యారు విజ‌య దేవరకొండ. త‌ర్వాత చేసిన అర్జున్ రెడ్డి మూవీ ఒక కొత్త ట్రెండ్ కి నాంది ప‌లికాడు. విజ‌య్ దేవ‌రకొండ అర్జున్ రెడ్డితో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నారు. అదే అర్జున్ రెడ్డికి సంబంధించిన మ‌రో వార్త ఇప్పుడు ఫిలిం న‌గ‌ర్లో హల్ చ‌ల్ చేస్తుంది.
 Director wants to do the sequel of Arjun Reddy
అర్జున్ రెడ్డికి సీక్వెల్ చేయ‌బోతున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈవిష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌డంతో ఆయ‌న స్పందించారు. అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ న‌న్ను క‌లిసి సీక్వెల్ చేద్దామ‌న్నారు. 40 ఏళ్ల త‌ర్వాత అర్జున్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉంటుందో చెబితే బాగుంటుంద‌వని నా అభిప్రాయం అన్నార‌ని విజ‌య్ చెప్పుకొచ్చారు.
బోల్డ్ గా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌ వ‌ర్షం కురిపించింది. 4 కోట్ల‌తో నిర్మించిన ఆ మూవీ 40 కోట్ల‌కు పైనే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక అర్జున్ రెడ్డి సీక్వెల్ మూవీ తెర‌కెక్కితే ఏ రేంజ్ లో ఉంటుందో అని సినీ ప్రేక్ష‌కులు భావిస్తున్నాటర‌ట‌. సందీప్ రెడ్డి వంగ ఒక వైపు రాంచ‌ర‌ణ్ తో, మ‌రోవైపు మ‌హేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంత బిజీ టైమ్ లో అర్జున్ రెడ్డి సీక్వెల్ ఎప్పుడు తెర‌కెక్కిస్తారో చూడాలి మ‌రీ.

- Advertisement -