టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఈసినిమా చిత్రకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటిస్తుంది. ఇక త్రివిక్రమ్ ను లీక్ ల సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈసినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఎన్టీఆర్, నాగబాబు మధ్యలో జరిగే ఎమోషనల్ సిన్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈసీన్ లోని ఓ పిక్ బయటకు రావడంతో ఈపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దింతో త్రివిక్రమ్ ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. త్రివిక్రమ్ తాజాగా ఓ నిర్ణయం తిసుకున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ లో పాల్గోనే వారు ఎవరయినా సరే మొబైల్స్ బయటే పెట్టి రావాలని యూనిట్ సభ్యలకు సూచించారని సమాచారం.
అంతగా అర్జెంట్ కాల్స్ ఉంటే బయటకు వెళ్లి మాట్లాడాలని షూటింగ్ పాల్గోనే వారికి తెలిపారని సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమాలో కూడా లీక్ లు జరిగాయి. దింతో తన ప్రతి సినిమాకు లీక్ లతో సతమతమవుతుండటంతో ఈనిర్ణయాన్ని తీసుకున్నారు త్రివిక్రమ్. ఇప్పటివరకూ సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా దసరా కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.