మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఎన్టీఆర్’..

235
ntr biopic

మాజీ ముఖ్య‌మంత్రి, మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల క్రీతం ఈసినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ఎన్టీఆర్ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం హైదర‌బాద్ శివార్ల‌లో ఈసినిమా షూటింగ్ ను జ‌రుపుకుంటుంది. భారీ తారాగ‌ణంతో ఈమూవీని రూపొందిస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ఎన్టీఆర్ జీవితంలో కీల‌క పాత్ర పోషించిన వారి పాత్ర‌ల‌ను ఈచిత్రంలో చూపించ‌నున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌గా,అత‌ని భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టీ విద్యాబాల‌న్ న‌టిస్తుంది.

NTR-biopic

నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో ద‌గ్గుబాటి రాణా న‌టించ‌గా, అక్కినేని నాగేశ్వ‌ర రావు పాత్ర‌లో సుశాంత్, మ‌హాన‌టి కీర్తి సురేష్ పాత్ర‌లో కీర్తి సురేష్ తోపాటు ప‌లు పాత్ర‌ల‌లో ప్ర‌కాశ్ రాజ్, సీనియ‌ర్ న‌రేష్, మోహ‌న్ బాబు, ఓ ప్ర‌త్యేక‌మైన సాంగ్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. తాజ‌గా ఈసినిమాకు సంబంధించిన మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేశారు చిత్ర‌యూనిట్. బాల‌కృష్ణ , విద్యాబాల‌న్ ప‌లువురు న‌టీన‌టుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రిక‌రించారు. త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించి సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌బృందం.