తెలుగు తెరకు ఒక అద్భుతమైన కోహీనూర్ వజ్రం లాంటివ్యక్తి అని దర్శకధీరుడు జక్కన్న అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1200కోట్లు వసూళ్లు సాధించింది. అయితే తాజాగా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు సాధించిన విషయం తెలిసిందే. అయితే అక్కడే జరిగిన ఓ ఇంటర్యూలో జూ.ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ…. పుట్టకతోనే నటనను పుణికిపుచ్చుకున్నాడని అన్నారు.
నటనలో తన పవర్ హౌస్‌లాంటివాడని…తన నుంచి మనం చాలా నేర్చుకోవాలి అన్నారు. దర్శకుడు సన్నివేశం చేప్పగానే పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడని కితాబు ఇచ్చారు. తారక్ కెమెరా యాంగిల్‌ను పట్టించుకోడని దాంతో తన ఎటు వైపు నుంచి అయినా కెమెరాలో తన నటనను బంధించవచ్చని పేర్కొన్నారు. డైలాగ్ డెలివరీని సింగిల్ టెక్‌లో చేప్పేస్తాడని….ఎన్ని పేజీలు ఉన్నా పట్టించుకోడని పేర్కొన్నారు. నటన కోసం పుట్టినట్టుగా ఉంటారని అన్నారు. ఖచ్చితంగా తారక్ ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి…