రాజమౌళి…సరికొత్త రికార్డు..!

71
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించారు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లిన జక్కన్న…ఆర్‌ఆర్‌ఆర్‌తో మరింత పాపులర్‌ అయిపోయారు. ఈ రెండు సినిమాలతో పలు అవార్డులను అందుకున్న రాజమౌళి తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌(NYFCC) ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడు కావడం విశేషం.

ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్‌ సినిమా ఈ ఘనత సాధించిందంటే రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్‌లో తార‌క్ కొమురం భీమ్ పాత్రలో న‌టించగా, రామ్‌ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -