బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పరోక్ష కామెంట్స్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రాగా తొలిసారి స్పందించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్‌లోని హీరోలలో ఒకరు స్కల్ క్యాప్ ధరించి ముస్లింగా కనిపిస్తాడు. అది చూసి ఓ రైట్‌వింగ్ రాజకీయ నాయకుడు నేను ఆ సన్నివేశాన్ని తొలగించకపోతే థియేటర్‌ను తగలబెడతానని, నన్ను బహిరంగంగా కొడతానని వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఏ విషయం గురించి పోరాడుతున్నప్పటికీ నాకు అతివాద వ్యక్తులు నచ్చరు. ఎందుకంటే.. వారికి ఓ నిర్దిష్ట పాత్ర ఎందుకు టోపీ ధరించి ఉంటుందో చూసే ఓపిక లేదు. అలాగే మరికొందరు హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్నానని చెప్పడానికి సాకులు వెతుకుతూ ఉంటారు. వారు తీవ్ర జాతీయవాదులు, నకిలీ ఉదారవాదులు. నేను కూడా వారిలో ఒకడిని కానందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు బీజేపీ చీఫ్ బండి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ముస్లిం టోపీ ధరించి ఉండటం,ఆ సన్నివేశాలను తొలగించాలని లేకుంటే థియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్పందించారు జక్కన్న.
ఇవి కూడా చదవండి..