షాక్‌.. ధోనిపై కేసు నమోదు..!

325
dhoni
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చాలా కూల్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థ స్కామ్‌లో ధోనిపై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన పలువురు బాధితులు ఈ స్కామ్‌లో ధోని పాత్ర కూడా ఉందని ఆరోపించారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ధోని పేరును చేర్చారు.

అయితే ఒకప్పుడు ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు ధోని ప్రచార కర్తగా వ్యవహరించాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని ఉండటంతో చాలామంది ఫ్లాట్ల కోసం డబ్బులు అడ్వాన్స్ రూపంలో ముట్టజెప్పారు. అలా వచ్చిన కోట్ల సొమ్మును ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు తరలించడం జరిగింది. ఆ కంపెనీల లిస్ట్‌లో ధోని భార్య సంస్థ కూడా ఉండటం గమనార్హం.

amrapali case

ఇక అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తీసుకుని లబ్దిదారులకు ఫ్లాట్లను అప్పజెప్పక పోవడంతో.. వారందరూ పోలీసులను ఆశ్రయించారు. 2017లో ఈ కేసు సుప్రీమ్‌కు చేరగా.. ఆ సంస్థ మోసాలకు పాల్పడిందని రుజువైంది. దీంతో ఆమ్రపాలి డైరెక్టర్లు జైలుపాలయ్యారు. ఇకపోతే ఇప్పుడు ఈ స్కామ్ ఇటు తిరిగి.. అటు తిరిగి ధోని మెడకు చుట్టుకుంది. ధోనీపై నమ్మకంతోనే ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బును కట్టామని.. ఈ కుట్రలో అతడికి కూడా భాగం ఉండొచ్చని వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గ్రూప్‌ ద్వారా ఫ్లాట్లు కొనుగోలు చేసిన పలువురు చేసిన ఫిర్యాదు మేరకు ఇప్పటివరకూ ఏడు ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.

Former India skipper MS Dhoni can get into a dangerous situation through his association with the real estate group Amrapali On July 23..

- Advertisement -