గ్రీన్ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన ములుగు ఏఎస్‌పీ..

79
asp mulugu

గ్రీన్ ఛాలెంజ్‌కు ములుగు జిల్లా పరిపాలన అధికారుల నుండి సహృదయ స్పందన లభిస్తోంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన ములుగు జిల్లా ఏఎస్‌పీ సాయి చైతన్య ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది. ఈసందర్భంగా ములుగు జిల్లా ఏఎస్‌పీ మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.

mulugu asp

రాజేష్ చంద్ర ఐపీఎస్, (ఏఎస్ పి భద్రాద్రి) మరియు ప్రదీప్ శెట్టి ఐ.ఎఫ్.స్(డి.ఎఫ్. ఓ ములుగు) మరియు సంతోష్ బాదావత్ ఐ.పి.ఎస్ (స్పెషల్ ఆఫీసర్ వరంగల్)ని గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని ములుగు జిల్లా ఏఎస్పి సాయి చైతన్య అన్నారు ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ వై సతీష్ రెడ్డి గారు పాల్గొన్నారు.