బన్నీ ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్..

337
bunny
- Advertisement -

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని సుకుమార్ దర్శకత్వం వహించబోతుండటం వల్ల ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా గురించి వచ్చిన వార్తలు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది. అయితే కరోనా కారణంగా మార్చిలో మొదలు అవ్వాల్సిన షూటింగ్ ఇంకా కూడా మొదలు కాలేదు.

ఇంకా ఆలస్యం చేయకుండా పుష్ప షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు ఒక వీడియోను విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎలా జరిగాయి అనే విషయాన్ని చూపించడంతో పాటు సినిమా షూటింగ్ ఎక్కడ ఎప్పటి నుండి ప్రారంభించబోతున్న విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. రేపటి వీడియో కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై అప్పటికే మెగా ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి.

- Advertisement -