CM KCR:ధరణితోనే రైతుల భూములకు రక్షణ

42
- Advertisement -

ధరణితోనే రైతుల భూములకు రక్షణ ఏర్పడిందని…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారుల రాజ్యమే అవుతుందన్నారు సీఎం కేసీఆర్. నిజామాబాద్ రూరల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…ఎన్నికలు అనగానే ఆగమాగం కావొద్దన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చరిత్ర, పార్టీల వైఖరి తెలుసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తేనే వారి ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.ఎన్నికల్లో రాయి ఏందో రత్నం ఏందో తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. ఉన్న తెలంగాణను ఉడగొట్టి ప్రజలను హరిగోస పెట్టారన్నారు. ఆ పార్టీ చేసిన ఒక్క తప్పువల్ల 58 ఏళ్లు బాధలు అనుభవించామన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదిస్తే తెలంగాణ వచ్చిందన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిందన్నారు. అనేక ఇబ్బందులను అధిగమించి ఇవాళ తెలంగాణను దేశంలోనే నెంబర్‌ 1గా నిలిపామన్నారు.సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ ప్రగతి సాధించామన్నారు. రైతుల బాగు కోసం అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. రెండు వందలు ఉన్న పెన్షన్‌ను రెండు వేలకు తీసుకొచ్చింది బీఆర్ఎస్ అన్నారు. సంపద పెరిగిన కొద్ది దానిని ప్రజలకు పంచుకుంటూ పోయామన్నారు.

వ్యవసాయ స్థీరికరణ జరగాలని సాగు నీటి తీరువా రద్దు చేశామన్నారు. కరెంట్‌ను బాగు చేసి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. దేశంలో రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని…రైతులు ప్రమాద వశాత్తూ చనిపోతే రైతు బీమాను వారం రోజుల్లో ఇస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐటీ పాలసీతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించామని త్వరలోనే బెంగళూరు దాటుతున్నామని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా ఉన్నామన్నారు.

కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా చేస్తున్నారని మాట్లాడుతున్నారని వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. రైతు బంధు ఉండాలంటే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డిని గెలిపించాలన్నారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా 24 గంటల కరెంట్ ఉండాల్సిందేనని చెబుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారని…అలాంటి కాంగ్రెస్‌నే బంగాళా ఖాతంలో పడేయాలన్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు కట్ అవుతుందన్నారు.

Also Read:జాతీయ పత్రికా దినోత్సవం..

- Advertisement -