TTD:పంచమీ తీర్థానికి పటిష్ట ఏర్పాట్లు

66
- Advertisement -

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 18 వ తేదీ నిర్వహించనున్న పంచమి తీర్థానికి టీటీడీ అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వాహన సేవలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు . పంచమి తీర్థానికి వచ్చే భక్తులందరికీ అల్పాహారం, తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు .ముందు రోజు రాత్రికే వచ్చే భక్తులకు వేచి ఉండేందుకు మూడు వసతి కేంద్రాలు చేశామని, ఇందులో 25 వేల మంది భక్తులు ఉండవచ్చని చెప్పారు. వీరికి అవసరమైన అన్నప్రసాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ వివరించారు.

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పనకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు అమ్మవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. పంచమి తీర్థంకు తమిళనాడు తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుండి లక్షల సంఖ్య లో తరలి వచ్చే భక్తుల కోసం అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ వివరించారు.

Also Read:చలికాలం..ఇలా చేద్దాం

- Advertisement -