వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ-కింగ్ నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. 28 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శివ మూవీ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా కర్నాటకలో ఓ పోలీస్ ఆఫీసర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నాగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నానితో మల్టీస్టారర్ చేసిన చేస్తున్నానని చెప్పిన నాగార్జున్..టైటిల్ ఇంకా కన్ఫామ్ కాలేదన్నారు.
హీరోగా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధనుష్….రజనీ కోసం ఓ కథను సిద్ధం చేశాడట. అయితే,ప్రస్తుతం రజనీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే కథను నాగ్ తో తెరకెక్కించాలని భావిస్తున్నారట. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కనుంది. మోహన్‌లాల్ మరో హీరోగా నటించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా చేస్తున్నట్టుగా నాగ్ కన్ఫామ్ చేయలేదు.