చిరు 150 కథలో నాగ్..

210

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’. తన తనయుడు పూరి ఆకాష్ హీరోగా రూపొందించిన ఈ సినిమాపై పూరి భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించినంత ఫలితాన్ని చూపించకపోవడంతో నిరాశకులోనయ్యారు. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా పూరి మళ్లీ ఆకాష్‌తో మరో సినిమా చేయడానికి సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

 Puri With Nagarjuna For Third Time

ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇక విషయానికొస్తే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగానే పూరి మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి పావులు కదుపుతున్నారు. కింగ్ నాగార్జునకు ఓ కథ వినిపించాడని, దానికి నాగ్ ఓకే చెప్పాడన్న వార్త గత కొన్ని రోజుల నుంచి జోరుగా వినిపిస్తోంది.

అయితే చిరంజీవి 150వ సినిమా చేయటానికి పూరి ఈ కథను వినిపించాడట. కానీ ఆ కథ నచ్చకపోవడంతో చిరుతో సినిమా చేయలేకపోయడట. ఇక ఇదే స్టోరీని కొన్ని మార్పులు చేర్పులు చేసి నాగ్‌కు వినిపించాడని సమాచారం. ఇక ఇందులో నాగచైతన్య కూడా ఉండబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని నాగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.