సెట్స్‌ పైకి ధనుష్..నానే వరువెన్

50
dhanush

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో ధనుష్‌.తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న నానే వరువెన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆగస్టు 20 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు దర్శకుడు సెల్వరాఘవన్. సినిమా షూటింగ్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

ప్రస్తుతం ధనుష్ ‘ది గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీ చిత్రీకరణలో ఉండగా రెండు వారాల్లో చెన్నైకి తిరిగి రానున్నాడట. చిన్న గ్యాప్ తర్వాత సెల్వరాఘవన్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రానికి కలైపులి ఎస్ థాను నిర్మాత. యాక్షన్ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. దీంతో పాటు ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ త్రిభాషా చిత్రంలో నటించనున్నారు ధనుష్‌.