ఇందిరాగా కంగనా..!

42
indhira gandhi

తలైవి తర్వాత ఇందిరా గాంధీగా మెప్పించనున్నారు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. భార‌త‌దేశ దివంగ‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో తాను న‌టించ‌బోతున్న‌ట్లు కంగ‌నా అధికారికంగా తెలిపారు. అయితే ఇది బయోపిక్ కాదని…. కేవలం ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.

సాయి కబీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా కంగనా సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. పొలిటికల్ డ్రామాతో ఈ తరం వారికి ప్రస్తుతం భారతదేశ రాజకీయ పరిస్థితులు అర్థం అయ్యేలా రూపొందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీ, నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం కంగనా నటిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ తలైవి తమిళ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.