మూడో వేవ్ పూర్తిగా ముగుసింది- డీహెచ్ శ్రీనివాస్‌

61
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ పూర్తిగా ముగిసింద‌ని చెప్పుకోవ‌చ్చని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డీహెచ్‌ శ్రీ‌నివాస‌ రావు అన్నారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. జనవరి 28న 3వ వేవ్ పీక్ వచ్చింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 2కంటే తక్కువ నమోదైంది అన్నారు. మూడో వేవ్ పూర్తిగా ముగుసింది అని చెప్పొచ్చు మొదటి వేవ్ దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డాము. అలాగే రెండో వేవ్ దాదాపు 6 నెలలు ఉంది. ఇక మూడో వేవ్ 28 రోజుల్లోనే పీక్ నెంబర్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్‌ను సమర్ధంగా ఎదుర్కొంది అన్నారు.

థ‌ర్డ్ వేవ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి తాము స‌మ‌ర్థంగా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గాయ‌ని వివ‌రించారు. అయితే, పూర్తిగా మాత్రం క‌నుమ‌రుగుల కాలేద‌ని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్లు వేయించుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. టీకాలు తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు. క‌రోనా కొత్త వేరియంట్లు పుట్ట‌కుండా వ్యాక్సిన్ల వ‌ల్ల క‌ట్ట‌డి చేయొచ్చ‌ని చెప్పారు.

తెలంగాణ‌లో ఫీవ‌ర్ స‌ర్వే ద్వారా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ వెళ్లి కిట్లు అంద‌జేశార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం క‌రోనా ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్నామ‌ని చెప్పారు. ఐటీ సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోమ్ ల ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని ఆయ‌న కోరారు. అన్ని సంస్థలు 100% పని చేయొచ్చు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకి రావచ్చు.అన్నారు. విద్య సంస్థలు పూర్తిగా ప్రారంభించాము. పిల్లలలో ఆన్లైన్ తరగతులతో మానసిక సమస్యలు వస్తాయి. కేసులు తగ్గినా మాస్క్ లు ధరించాలి. అందరూ టీకా తీసుకోవాలని కోరారు.

ఇక మేడారం జాతరకు ప్రత్యక ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందు కోసం ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్ కలిగిన ఆసుపత్రిని సిద్ధం చేసాము. అవసరమైన టెస్ట్ లు అక్కడే చేసేలా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా టీకాలు ఇచ్చాము. ఇందులో 82% మందికి రెండు డోస్ ల టీకా ఇచ్చాము. టీనేజర్ లకు 73% మందికి తొలిడోస్,13% మందికి రెండు డోస్ లు ఇచ్చాము. రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలో నిజామాబాద్, ఆసిఫాబాద్ మినహా అంతటా 100% తొలిడోస్ పూర్తి చేశాము. వచ్చే కొద్దీ నెలల పాటు కొత్త వేరియెంట్ పుట్టే అవకాశం లేదు. త్వరలో కోవిడ్ ఎండమిక్ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూ లా కోవిడ్ మారిపోతుంది అన్నారు.

- Advertisement -