పల్లె ప్రగతితో దేశానికే ఆదర్శంగా గ్రామాలు: కేటీఆర్

32
- Advertisement -

పల్లె ప్రగతితో దేశానికే ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు నిలిచాయన్నారు మంత్రి కేటీఆర్. సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామీణ యోజ‌న ర్యాంకుల‌ను కేంద్రం ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించగా టాప్ టెన్ ర్యాంకుల్లో తెలంగాణ ఏడు ర్యాంకుల‌ను కైవ‌సం చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్రంలో నిజ‌మైన గ్రామీణాభివృద్ధి జ‌రుగుతుంద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

దేశంలోని తొలి ఆద‌ర్శ గ్రామంగా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని వెన్న‌పంల్లి గ్రామం నిలిచింది. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్‌ప‌ల్లి రెండో స్థానంలో, కంద‌కుర్తి ఐదో స్థానంలో, తానాకుర్ద్ ప‌దో స్థానంలో, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని గ‌న్నేరువ‌రం నాలుగో స్థానంలో, వీర్న‌ప‌ల్లి ఆరో స్థానంలో, రామ‌కృష్ణాపూర్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి.

- Advertisement -