ఒడిశా రైలు ప్రమాద సమయంలో మరణించిన వారి మృతదేహాలను తాత్కాలికంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో భద్రపరిచారు. బాలాసోర్‌లోని బహనాగ హైస్కూలులో తాత్కాలికంగా మృతదేహాలను భద్రపరిచారు. అనంతరం పాఠశాల గదులను శానిటైజ్ చేశారు. అయినప్పటికీ పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాల ప్రధానోపాద్యాయురాలు ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్లారు.
Also Read: ఏఐ మాయతో చిన్నారులుగా మారిన దేశాధినేతలు..!
పాఠశాల భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలని కోరింది. దాంతో పాటు పాఠశాల 65యేళ్ల క్రితం నిర్మించినందున ఆ భవనం ఇంకెంత మాత్రం సురక్షితం కూడా కాదని స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చింది. దీంతో ప్రభుత్వం బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ బవుసాహెబ్ షిండే పాఠశాలను గురువారం సందర్శించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ, ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది, స్థానికుల పిర్యాదు మేరకు పాఠశాల భవనం కూల్చి కొత్త భవనం నిర్మిస్తే పిల్లలు తిరిగి క్లాసులకు వచ్చేందుకు సిద్ధమని స్థానికులు తెలపడంతో…ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాఠశాలను కూల్చివేత పనులు శుక్రవారం మొదలయ్యాయి. ఒడిశాలో జూన్ 19న నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
Also Read: Harish:సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగం