ఆఫర్ల కోసం సమంత తంటాలు

54
- Advertisement -

సమంత మొన్నటి వరకు టాప్ హీరోయిన్. పైగా హీరోయిన్లలోనే యమా క్రేజున్న భామగా సమంత ఎన్నో ఏళ్లుగా చలామణి అవుతూ వచ్చింది. కానీ పాపం శాకుంతలం డిజాస్టర్ దెబ్బకు ఈ అందాల సుందరి ఫేట్ మారిపోయింది. ఇప్పుడు తన స్థాయికి తగ్గట్టుగా స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది సమంతకి. దానికి కారణం వరుస ఫ్లాపులే. సమంత రీసెంట్ గా చేసిన జాను, యశోద, శాకుంతలం.. ఇలా వరుసగా మూడు సినిమాలు దారుణంగా పరాజయం అయ్యాయి. నిజంగా సమంతకి ఇది ఒక షాకే. శాకుంతలం సినిమా కనీసం యావరేజ్ గా అయినా ఆడుతుంది అనుకొంది.

కానీ, శాకుంతలం కూడా పోవడంతో ఇప్పుడు సమంతకి అవకాశాలు అంత ఈజీగా రావడం లేదు. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నది ఒక్కటే చిత్రం. అదే ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. లైగర్ దెబ్బకు విజయ్ క్రేజ్ కూడా పోయింది. కాబట్టి, ఖుషి పై భారీ అంచనాలు లేవు. ఇక సమంత చేతిలో ఓ వెబ్ సిరీస్ ఉంది. హిందీలో ‘సిటాడెల్’ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది కాకుండా ‘చెన్నై స్టోరీ’ అనే ఒక అంతర్జాతీయ చిత్రం వచిన్నట్టు వచ్చి జారిపోయిందని తెలుస్తోంది. మొత్తానికి సమంతకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.

Also Read: ఎక్స్ పోజింగ్ ఏమిటి ? ఏమైనా చేస్తానంటుంది

చేస్తున్న సినిమా అయిపోతే ఆ తర్వాత ఏంటి? ఈ విషయంలోనే సమంతకి ఇంకా క్లారిటీ రావడం లేదు. తమిళంలో సమంతకి మరో రెండు చిత్రాలున్నాయి. అవి కూడా మీడియం రేంజ్ హీరోలవి. అందుకే అవి ఒప్పుకోవడం లేదు. సమంతకి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కావాలి. అందుకే ఈ భామ ఇప్పుడు నిత్యం దర్శకనిర్మాతలతో పాటు స్టార్ హీరోలతో కూడా టచ్ లోకి వెళ్తుంది. మళ్ళీ క్రేజ్ కోసం నానా తంటాలు పడుతుంది. సమంత రెండేళ్ల క్రితం తన భర్త నాగ చైతన్య నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఆమె టైమ్ అసలు బాగాలేదు.

Also Read: తమన్నా డబ్బు కోసమెగా ఇలా ?

- Advertisement -