బెంగళూరుపై ఢిల్లీ విజయం..

270
Delhi Capitals
- Advertisement -

బెంగళూరుపై ఢిల్లీ విజయం విజయ ఢంకా మోగించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఇక బెంగళూరు 12 మ్యాచుల్లో ఎనిమిది మ్యాచులు ఓడిపోవడంతో ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపు కోల్పోయింది. ఢిల్లీ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ 171 పరుగులకే పరిమితమైంది.

ఆర్సీబీ జట్టులో పార్ధివ్‌ పటేల్‌(39), కోహ్లి(23), డివిలియర్స్‌(17), దూబె(24), గుర్‌కీరత్‌(27), స్టోయినిస్‌(32 నాటౌట్‌)లు మోస్తరుగా రాణించడంతో ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో రబడ, మిశ్రాలు చెరో రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌, రూథర్‌ఫర్డ్‌లు తలో వికెట్‌ తీసి విజయం కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 187 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(50; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(52: 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ తీసుకున్న ఢిల్లీ 35 పరుగుల వద్ద ఓపెనర్‌ పృథ్వీషా(18) వికెట్‌ను నష్టపోయింది. అటు తర్వత ధావన్‌కు జత కలిసిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ‍్యర్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు.

- Advertisement -