ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు..

173
Inter Advanced Supplementary Exam

తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25 నుంచి జూన్ 1 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.

మే 25న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకూ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.