పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. క్రిమినల్ డిఫమేషన్ కేసులో స్టే విధించాలని కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు తిరస్కరించింది. 2019 ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఇంటిపేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌కు చెందిన నేత పూర్ణేశ్ మోదీ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు సంబంధించిన తీర్పును ఇటీవల వెల్లడిస్తూ రాహుల్‌కి రెండేళ్ల శిక్ష పడింది.దీంతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కొల్పోయారు రాహుల్.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే
ఈ కేసులో అప్పీల్ చేసే అవకాశం ఉండటంతో కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరగా సూరత్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో గుజరాత్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించనున్నట్లు సమాచారం.
Also Read:పొట్టి డ్రెస్‌లో బుట్టబొమ్మ
ట్రయల్ కోర్టు తన పట్ల తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ వాదించారు. తన ఎంపీ స్టేటస్‌ను పట్టించుకోకుండా ట్రయల్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు. అయితే సెషన్స్ కోర్టు ఆ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు.
Also Read:IPL 2023:డబుల్ ధమాకా..డిల్లీ ఖాతా తెరిచేనా?