ఆదిపురుష్ కొత్త టీజర్ వైరల్

44
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆదిపురుష్ పై ఆసక్తి రెట్టింపు అయింది. అయితే, గతంలో విడుదలైన టీజర్ లో గ్రాఫిక్స్ పై అభిమానులు బాగా నిరాశ చెందారు. దాంతో చిత్ర బృందం విజువల్ ఎఫెక్ట్స్ పై మళ్లీ వర్క్ చేసింది. ఈ కారణంగానే సినిమా విడుదల ఆలస్యం అయింది. కాగా తాజాగా వీఎఫ్ ఎక్స్ మార్పులు చేసిన టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. టీజర్ లో ఈ సారి వీఎఫ్ ఎక్స్ బాగానే ఉంది. కానీ, పూర్తి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 విడుదల కానుంది. చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతోంది.

బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి కృతిసనన్ జోడీగా నటిస్తోంది. అన్నట్టు ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో 15 దేశీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీని మోషన్ కాప్చర్ విధానంలో షూట్ చేస్తున్నారు.

Also Read:సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!

అంటే.. నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారు. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా ఉంటుంది. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

Also Read:ఈ మూడు ఆసనాలతో.. ఆ సమస్యలు దూరం!

- Advertisement -