పొట్టి డ్రెస్‌లో బుట్టబొమ్మ

53
- Advertisement -

పూజా హెగ్డే రెడ్ డ్రెస్‌లో గ్లామర్ డోసు పెంచింది. ఈ రోజు తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు మత్తెక్కించేలా ఉన్నాయి. లేటెస్ట్ ఫొటోషూట్లో ఇలా రెడ్ డ్రెస్‌లో చాలా హాటు పోజులిచ్చింది. ఈ పొట్టి డ్రెస్‌లో పూజా మరింత క్యూట్‌గా కనిపించింది. ఈ ఫొటోలకు కొన్ని గంటల్లోనే లక్షల కొద్దీ లైక్స్ వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం జోరుగా ప్రమోషన్స్‌ లో పాల్గొంటోంది.

Also read: పిక్ టాక్ : ఒంపుసొంపులతో షేక్ చేసింది

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను నటించిన సినిమాల ఫెయిల్యూర్స్‌ గురించి చెప్పింది. తానూ నటించిన చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోతే నటిగా నేను ఫెయిలైనట్లు కాదంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు నన్ను అభిమానిస్తున్నారని తెలిపింది. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమాపై బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కామెడీ, యాక్షన్‌ ప్రధానంగా సినిమా తెరకెక్కింది.

Also read: సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!

ఈ సినిమా నుంచి ‘లెట్స్‌ డ్యాన్స్‌ చోటు మోటు’ అంటూ సాగే హూషారెత్తించే సాంగ్‌ను మేకర్స్‌ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పాటలో పట్టు పంచెలు, లంగా ఓణీలను ధరించిన దక్షిణాది సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. పూజా హెగ్డే లుక్ కూడా అదిరిపోయింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

- Advertisement -