IPL 2023:డబుల్ ధమాకా..డిల్లీ ఖాతా తెరిచేనా?

46
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు ఆధీమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాయి. సాధారణంగా ఐపిఎల్ లో శని, ఆదివారాలు రెండేసి మ్యాచ్ లు జరగడం చూస్తుంటాం. కానీ ఈసారి సరికొత్తగా గురువారం కూడా రెండేసి మ్యాచ్ లు నిర్వహిస్తోంది బీసీసీఐ. అందులో భాగంగానే నేడు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ పంజాబ్ వర్సస్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మద్యాహ్నం 3:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఇక రెండవ మ్యాచ్ కోల్ కతా మరియు డిల్లీ మద్య జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. .

మొదటి మ్యాచ్ లో తలపడుతున్న పంజాబ్ మరియు బెంగళూరు అభిమానులకు మంచి వినోదాన్ని పంచే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో లక్నో పై విజయం సాధించిన పంజాబ్ మంచి జోరు మీద ఉంది. దాంతో బెంగళూరుపై కూడా విజయం సాధించి టాప్ 3 లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు గత మ్యాచ్ లో చెన్నై చేతిలో స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకున్న బెంగళూరు ఈసారి విజయం సాధించి మళ్ళీ లీడ్ లోకి రావాలని చూస్తోంది. దాంతో ఈ రెండు బలమైన జట్ల మద్య జరిగే ఆసక్తికరమైన పోరు అభిమానులకు మంచి వినోదాన్ని పంచే అవకాశం ఉంది. ఇక రెండవ మ్యాచ్ లో భాగంగా డిల్లీ మరియు కోల్ కతా తలపడనున్నాయి.

Also Read:సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!

డిల్లీతో పోలిస్తే కోల్ కతా అత్యంత పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ ఇలా అన్నీ విభాగాల్లో కూడా దుర్బెద్యమైన లైనప్ కలిగి ఉంది. దాంతో కోల్ కతా ను ఎదుర్కోవడం డిల్లీకి అంతా సులువేమీ కాదు. అయితే గత మ్యాచ్ లో ముంబై చేతిలో కోల్ కతా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఈ మ్యాచ్ లో విజయం కోసం కోల్ కతా గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. మరోవైపు వరుస పరాజయాలతో డిల్లీ పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో కూడా డిల్లీ ఓటమి చవిచూసింది. దాంతో ఈ మ్యాచ్ లో కూడా డిల్లీపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. మరి డిల్లీ ఈ మ్యాచ్ తోనైనా ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి.

Also Read:Bharat:హ్యాపియేస్ట్‌ స్టేట్ ఎదంటే…!

- Advertisement -