బాలీవుడ్ లో రికార్డుల గురించి ప్రస్తావిస్తే..ముందుగా చెప్పాల్సిన పేరు మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్. ఆకట్టుకునే కథ..దానికి సరితూగేలా ఆమిర్ నటన ఇవన్నీ మిస్టర్ పర్ఫెక్ట్ కు రికార్డులను తెచ్చిపెడతాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. పీకే సినిమాతో ఇప్పటికే బాలీవుడ్ లో హైయ్యేస్ గ్రాసర్ గా నిలిచిన అమీర్.. దంగల్ సినిమాతో సరికొత్త చరిత్రను సృస్టించాడు. రిలీజై 28 కావస్తున్నా..ఇప్పటికీ కలెక్షన్ల వేట కొనసాగుతూనే ఉంది. దీంతో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పిన దంగల్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు రూ.365.87 కోట్లు కలెక్ట్ చేసిన దంగల్ మరో 4 కలెక్ట చేస్తే 400 కోట్ల క్లబ్ లో చేరుతుంది. దేశంలో 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ఆమిర్ మూవీ నిలిచిపోతుందని అంటున్నారు. 700 కోట్ల గ్రాస్‌తో 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మొన్నటి వరకు భారత్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ఆమిర్ ఖాన్ పీకే మొదటి స్థానంలో, భజరంగీ భాయిజాన్ రెండో స్థానాల్లో ఉన్నాయి. వాటిల్లో పీకే 340.8 కోట్లు రాబట్టగా భజరంగీ భాయిజాన్ 320.34 కోట్ల కలెక్షన్లు సాధించింది. తాజాగా వీటన్నింటిని బీట్ చేసి దంగల్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో తొలిసారి 300 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన సినిమా కూడా ఆమిర్ ఖాన్ సినిమానే కావడం గమనార్హం.