వార్ సీన్స్ విపరీతంగా నచ్చేశాయ్..వెంకయ్య నాయుడు

185
Venkaiah
- Advertisement -

“తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన చిత్రమంటూ యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్న “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రాన్ని సెంట్రల్ మినిస్టర్ వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించారు. చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఆయనతో కలిసి సినిమా చూశారు. సినిమా అనంతరం మీడియాతో తన మనసులోని మాటను పంచుకొన్నారు.

“సినిమా అద్భుతంగా ఉంది. మాటలు మొదలుకొని పాటలు, స్క్రీన్ ప్లే అన్నీ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయి. నవతరానికి తెలుగు జాతి చరిత్రను తెలియజెప్పేందుకు దర్శకుడు క్రిష్, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. కేవలం 79 రోజుల్లో ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని పూర్తి చేయడం, ఈ రేంజ్ అవుట్ పుట్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అన్నిటికంటే.. ఈ సినిమాలో వార్ సీన్స్ నాకు విపరీతంగా నచ్చేశాయి. సాధారణంగా నా బిజీ షెడ్యూల్ కారణంగా నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తుంటాను. అయితే.. భారతీయ సినిమా చరిత్రలో ఈస్థాయి వార్ సీక్వెన్స్ లు నేను ఇదివరకూ చూడలేదు. ఇక శాతకర్ణి పాత్రకు బాలయ్య తప్ప వేరెవ్వరూ న్యాయం చేయలేరు” అని సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు వెంకయ్య నాయుడు.

Venkaiah

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు నాకు ఈ సంక్రాంతిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీయని విజయాన్ని అందించారు. మా సినిమా చూడడమే కాక మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబునాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్ రావు గారికి, వెంకయ్య నాటుడు గారికి నా ధన్యవాదాలు. తెలుగు వారికి మాత్రమే కాదు యావత్ భారతదేశానికే “గౌతమిపుత్ర శాతకర్ణి” ఓ కీర్తి కిరీటం” అన్నారు.

చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. “మా నమ్మకాన్ని నిలబెట్టిన తెలుగు సినిమా అభిమానులకు నా ధన్యవాదాలు. వారి అండ, తోడ్పాటు లేనీదే ఈ సినిమా ఈస్థాయి విజయం సాధించి ఉండేది కాదు” అన్నారు. రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. “నా కల నెరవేరిన రోజిది. బాలకృష్ణ గారి 100వ చిత్రానికి మాటలు రాసే అదృష్టం దక్కడం నా పూర్వ జన్మ సుకృతం. మా అమ్మ ఆశీర్వాద బలమే నేడు నాకు లభిస్తున్న కీరిప్రతిష్టాలకు కారణం” అన్నారు. నిర్మాత బిబో శ్రీనివాస్ మాట్లాడుతూ.. “సినిమాకి లభించిన అపూర్వ స్పందనతో సినిమా నిర్మాణం కోసం పడిన శ్రమ మర్చిపోయాం. చంద్రబాబునాయుడు, కె.సి.ఆర్ మరియు వెంకయ్య నాయుడు గార్లకు ఈ సందర్భంగా నా కృతజ్ణతలు” అన్నారు!

- Advertisement -