జీహెచ్ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు …

247
dana kishore

గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ కమీషనర్ దాన కిశోర్ బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూసాపేట్‌ సర్కిల్‌ భరత్‌ నగర్‌,జలవాయు విహార్‌ కాలనీల్లో పర్యటించారు.

భరత్‌ నగర్‌లోశానిటేషన్‌ కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్‌ నగర్‌ కాలనీ పార్కులో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సాఫ్‌ హైదరాబాద్‌ షాందార్‌ హైదరాబాద్‌ లో ప్రతి ఒక్కరు భాగస్వాములై నగర స్వచ్ఛతకు కృషి చేయాలని ప్రజలను కోరారు.

జలవాయు విహార్ కాలనీలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ స్మారక పార్కును సందర్శించారు. కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు,జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన

నగరంలోని మోడల్ కాలనీలను ఇతర కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు సందర్శించి స్పూర్తి పొందాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటి మొక్కలను నాటడానికి కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపిన ఆయన గాంధీ వనంలో స్ధానికులతో కలిసి మొక్కలునాటారు.