మాస్ లుక్ లో అదరగొడుతున్న “ఇస్మార్ట్ శంకర్” టీజర్(వీడియో)

195
ismart-shankarr

టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ..ఎనర్జీటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇస్మార్ట్ శంకర్. రామ్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాతో తాను ఎలాగైనా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు హీరో రామ్.

ఈసినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈరోజు హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఇస్మార్ట్‌ శంకర్ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. టీజర్ ను చూస్తుంటే పక్కా మాస్ యాంగిల్ లో ఈసినిమా ఉండనుందని తెలుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈమూవీ విడుదల తేదిని ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ మీకోసం..

Ismart Shankar Teaser | Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh | Puri Jagannadh