తెలుగు రాష్ట్రాలకు అసాని ముప్పు

46
asani
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు అసాని తుపాను ముప్పు పొంచి ఉంది. అండమాన్‌ ఐలాండ్‌కు 380 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు 979 కిలోమీటర్ల దూరంలో.. పూరీకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాల మధ్య కేంద్రీకృతమై.. దిశ మార్చుకుని పశ్చిమ బెంగాల్‌ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో.. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసాని తుపాను తీరం దాటే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీవ్ర తుపానుగా మారింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో.. ప్రయాణిస్తోంది. రాగల 24 గంటల్లో తుపాను కాస్తా.. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మత్స్యాకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీ, బెంగాల్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

- Advertisement -