సారీ చెప్పిన సీవీ ఆనంద్

3
- Advertisement -

జాతీయ మీడియాను ఉద్దేశించిన తాను చేసిన వ్యాఖ్యల పట్ల సారీ చెప్పారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌. సంధ్య థియేటర్‌ ఘటనపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను సహనం కోల్పోయానని చెప్పారు.

సంధ్య థియేటర్ ఘటనకు జాతీయ మీడియా మద్దతు ఇస్తోందంటూ వ్యాఖ్యానించారు సీవీ ఆనంద్. సీపీ వ్యాఖ్యలను జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు.తాను చేసింది పొరపాటుగా గుర్తించి.. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటన్నట్లు తెలిపారు.

రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో సహనం కోల్పోయినట్లు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తాను కాస్త సంయమనం పాటించాల్సింది అన్నారు.

 

Also Read:బన్నీ ఇంటిపై దాడి సరికాదు: సీఎం రేవంత్

- Advertisement -