ఒంటి గంటలోపే న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌

23
- Advertisement -

నూతన సంవత్సరం వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ నగర వార్షిక నేర నివేదికను రిలీజ్ చేసిన శ్రీనివాస్ రెడ్డి..డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లు ఎక్కడ ఉన్నా వెతికిమరి చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్‌ జాడను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్‌ని వాడుతామన్నారు.

రాత్రి ఒంటి గంటలోపు నూతన సంవత్సర వేడుకులను ఆపేయాలని…పబ్బులు, బార్లలో డ్రగ్స్‌ ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కొటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2 శాతం పెరిగాయని…స్థిరాస్తి కేసులు 3 శాతం పెరిగాయన్నారు. దోపిడీలు 9 శాతం పెరిగాయని …మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయన్నారు. రేప్‌ కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయన్నారు. సైబర్‌ నేరాల కారణంగా గత ఏడాది రూ.82 కోట్ల మోసాలు జరిగితే.. ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారని తెలిపారు.

Also Read:పుట్టగొడుగులు తింటున్నారా!

- Advertisement -