రాణించిన గైక్వాడ్,జడేజా…చెన్నై గెలుపు

57
gaikwad

ఐపీఎల్ 2020లో భాగంగా కోల్ కతాతో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 178 పరుగులు చేసింది. గైక్వాడ్‌కు తోడుగా చివర్లో జడేజా సూపర్ ఆటతీరుతో రాణించడంతో చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వాట్సన్ 14 పరుగులు చేసి వెనుదిరుగగా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు రుతురాజ్ గైక్వాడ్,అంబటి రాయుడు. రాయుడు 38 పరుగులు చేసి ఔటైనా బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలతో అలరించాడు గైక్వాడ్. 52 బంతుల్లో 2 సిక్స్‌లు, 6 ఫోర్లతో 72 పరుగులు చేసి అలరించాడు గైక్వాడ్. చివరలో జడేజా 11బంతుల్లో 33 పరుగులు చేసి విశ్వరూపం చూపించడంతో చెన్నై విజయం సునాయసమైంది.

అంతకముందు టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌ నితీశ్‌ రాణా(87: 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(26), దినేశ్‌ కార్తీక్‌(21), ఇయాన్‌ మోర్గాన్‌(15) ణించారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.