బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 54 హైలైట్స్

28
episode 54 highlights

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 54 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 54వ ఎపిసోడ్‌లో ఇంటి కెప్టెన్‌గా అరియానా ఎంపికవడం,రేషన్ మేనేజర్‌గా మోనాల్ ఎంపిక పట్ల మాస్టర్ అభ్యంతరం వ్యక్తం చేయడం,అనారోగ్యంతో ఇంటి నుండి బయటకు వచ్చారు నోయల్. ఇలాంటి ఆసక్తికర పరిణామాలతో ఎపిసోడ్ ముగిసింది.

నోయల్‌కు అర్థరైటిస్ వ్యాధి ఉండటంతో చల్లని ప్రదేశంలో ఉంటే కీళ్ల నొప్పులు అధికం అవుతుంటాయి. దీంతో తీవ్ర అనారోగ్య కారణంగా ఒత్తిడికి గురయ్యాడు. బాధను మరిచిపోవడానికి సాగేనా ఈ పయనం ఆగేనా.. ఈ రాత్రి ఎట్టా గడిచేనా అంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ బాధను మరిచిపోయే ప్రయత్నం చేశాడు నోయల్.

తర్వాత రేషన్ మేనేజర్ అరియానా పాత సరుకులు పాడైపోతున్నాయని.. అంతకు ముందు రేషన్ మేనేజర్‌గా చేసిన మెహబూబ్ సరిగా చేయకపోవడం వల్ల కూరగాయలు పాడైపోతున్నాయని గోల గోల చేసింది. ఇక అభిజిత్ ఈసారి మోనాల్‌ని టార్గెట్ చేస్తూ ఆమె నడిస్తే ఒంటే నడిచినట్లు ఉంటుందని తెలిపాడు. నువ్ కూడా అబ్జర్వ్ చేయి అంటూ నోయల్‌తో అనగా ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నావో అంటూ సెటైర్ వేశాడు నోయల్.

ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఆడవాళ్లకు మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్. ఆడవాళ్లను కెప్టెన్ చేసే బాధ్యతను ఇంట్లో ఉన్న మగవాళ్లకు ఇచ్చి గార్డెన్ ఏరియాలో ఒక కీ, బాక్స్ ఇచ్చి దాన్ని చేజిక్కించుకున్న వాళ్లు తమకు నచ్చిన వాళ్లకి ఆ కీ ఇవ్వొచ్చని కోరారు. అయితే మొదటి రౌండ్ అఖిల్ కీ దక్కించుకోగా మెనాల్‌కి ఆ కీ ఇచ్చేశాడు. దీంతో మోనాల్‌కి కెప్టెన్ పోటీదారుల్లో ఒకర్ని బయటకు పంపే ఛాన్స్ రావడంతో హారికను బయటకు నెట్టింది. దీంతో ముఖం మాడ్చుకుని కూర్చుండిపోయింది.

ఇక రెండో రౌండ్‌లో కీని మెహబూబ్ దక్కించుకోవడంతో ఆ కీని అరియానాకి ఇచ్చాడు. లాస్యను కెప్టెన్‌ పోటీ నుండి బయటకు పంపింది అరియానా. ఆ తర్వాత మూడో రౌండ్‌లో కీని రాజశేఖర్ మాస్టర్ దక్కించుకోవడంతో అరియానాకి ఇచ్చాడు. దీంతో మోనాల్‌ని కెప్టెన్‌ టాస్క్‌ నుండి బయటకు పంపేసి హౌస్‌కి కెప్టెన్ అయ్యింది అరియానా.

ఇక హౌస్‌కి కెప్టెన్ అయిన అరియానాకు రేషన్ మేనేజర్‌ని ఎంపిక చేసుకునే అధికారం ఉండటంతో మోనాల్ గజ్జర్‌కి ఆ అవకాశం ఇచ్చింది అరియానా.దీంతో మాస్టర్‌ తెగ ఫీల్ అయిపోయాడు. నీకు సపోర్ట్ చేసి తప్పు చేశా కష్టపడి నేను నిన్ను కెప్టెన్ చేస్తే ఆమెను రేషన్ మేనేజర్‌ని చేస్తావా? అంటూ ఫైర్ అయ్యాడు.అయితే రేషన్ మేనేజర్‌గా పదవి చేపట్టిన మోనాల్.. ఫ్రూట్స్ వేస్ట్ అయ్యాయని కంప్లైంట్ చేసింది. అంతకు ముందు రేషన్ మేనేజర్‌గా ఉన్న అరియానా సరిగా చూడలేనందుకువల్లే ఇలా జరిగిందని అవినాష్ దగ్గర చెప్పడంతో పోయి ఆమెతో చెప్పు అని చెప్పాడు. దీంతో అరియానా వచ్చి అవి వచ్చి రెండు రోజులే అయ్యింది పాడైపోతే నేనేం చేయాలని అంతా తననే టార్గెట్ చేస్తున్నారని తెలిపింది.

ఇక చివరగా నోయల్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో డాక్టర్‌ని కలవగా మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని అందుకోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. దీంతో భారంగా బిగ్ బాస్ హౌస్‌ని వీడాడు నోయల్.