కలెక్టర్లతో సీఎస్ సోమేశ్‌ కుమార్ రివ్యూ..

232
somesh kumar
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో రివ్యూ నిర్వహించారు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తున్న ధరణి పోర్టల్‌తో పాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చే ప్రక్రియ,తహసీల్దార్‌లకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు.

రైతు వేదికల నిర్మాణం, ఎల్‌ఆర్‌ఎస్‌, వీధివ్యాపారులు, వైకుంఠధామాల నిర్మాణం, కస్టమ్స్‌ మిల్లింగ్‌పై సమీక్షించనున్నారు. వ్యవసాయేతర భూములు, ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చి, డేటాను రూపొందించడానికి అదనపు కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించనున్నారు.

ఇక ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్ రూపకల్పనతో పాటు ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జిల్లాల వారీగా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు సీఎస్ సోమేశ్‌ కుమార్.

- Advertisement -