బిగ్ బాస్ 4..ఓటింగ్‌లో లీస్ట్ ఎవరో తెలుసా!

263
voting bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మూడోవారం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏడుగురు కంటెస్టెంట్లు యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా మూడోవారంలో అనూహ్యంగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు కుమార్ సాయి.

గత రెండు వారాల్లో లీస్ట్‌లో ఉన్న కుమార్ సాయి ఈ వారం అనూహ్యంగా టాప్ పొజిషన్‌లో నిలిచారు.ఇప్పటివరకు 112251 మంది ఓట్లు వేయగా 26533(23.64)శాతం ఓట్లు కుమార్ సాయికి పడ్డాయి. దీంతో ఆయన అగ్రస్ధానంలో కొనసాగుతున్నారు. ఇక రెండోస్ధానంలో 22261(19.83)శాతం ఓట్లతో హారిక ఉండగా మూడోస్ధానంలో 20847(18.57)శాతం ఓట్లతో లాస్య ఉన్నారు.

నాలుగో స్ధానంలో 14819(13.20)శాతంతో మొనాల్ ఉండగా 5వ స్ధానంలో 9490(8.45)శాతం ఓట్లతో మెహబూబ్ ఉన్నారు.ఇక ఆరోస్ధానంలో 9179(8.18)శాతం ఓట్లతో అరియానా ఉండగా చివరి స్ధానంలో దేవి నాగవల్లి 9122(8.13)శాతంతో ఉన్నారు.