వ్యాక్సిన్‌ తీసుకున్నాక..మద్యం సేవిస్తే!

206
liquor
- Advertisement -

భారత్‌లో దేశవ్యాప్తంగా నాలుగురోజుల క్రితం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ అందిస్తుండగా మార్చి నుండి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి రానుంది. అయితే వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అనేక అపోహలు ఉండగా తాజాగా ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

వ్యాక్సిన్‌ తీసుకోవాలని భావిస్తున్నవారు 45 రోజుల పాటు మద్యం తీసుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్‌ తీసుకోవాలని భావిస్తున్నవారు.. ఇప్పటికే తీసుకున్న వారు కొన్ని వారాల పాటు మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం వ్యాక్సిన్‌ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. సెకండ్‌ డోస్‌ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు డాటా వెల్లడిస్తుంది. అందువల్ల టీకా తీసుకోవాలనుకునే వారు.. ఇప్పటికే తీసుకున్న వారు ఓ 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం మేలని సూచిస్తున్నారు.

- Advertisement -