కరోనా..భావోద్వేగానికి గురైన సానియా మీర్జా

76
sania

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడించింది. కరోనా దెబ్బకు లక్షలాదిమంది నిరాశ్రయులు కాగా లక్షల సంఖ్యలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో కరోనా అనుభవాన్ని సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకున్నారు భారత టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా.

కరోనా సోకి ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా భయానకం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనకి కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ.. అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదన్నారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లోనే ఉన్నానన్నారు. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో ఒంటరిగా, కుటుంబానికి, ఆత్మీయులకు దూరంగా ఉన్న వారి పరిస‍్థితి ఊహించడానికే కష్టం అని చెప్పుకొచ్చారు సానియా.