ఒక ఫోటో జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదేనేమో..

66
- Advertisement -

సంక్రాంతి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ వందేభారత్‌ రైలును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. వందే భారత్‌ రైల్లో భాగంగా ఇది ఎనిమిదవది. కాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు రోజు రెండు ట్రిప్పులు నడిచే ఈ రైలు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీవైష్ణవ్‌, కిషన్‌రెడ్డి తెలంగాణ డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ వందేభారత్ రైల్లో ప్రయాణించాలంటే సామాన్య ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది.

ఇటువంటి తరుణంలో ఒక ప్రబుద్ధుడు రైలు ఎక్కి మరి సెల్ఫీ దిగాడానికి ప్రయత్నించాడు. దీంతో డోర్‌ లాక్‌ కావడం చేత విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ప్రయాణించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన టీసీ “ఈ రైలు ఎక్కడ ఆగదు టికెట్‌ తీసుకొని కూర్చొండి మరియు ఫైన్ కూడా కట్టండి అని చావు కబురు చల్లగా చెప్పాడు”. దీంతో అవాక్కయిన సదరు వ్యక్తి టికెట్‌ తీసుకున్నాడు. ఫైన్ కట్టి మళ్లీ తిరుగు ప్రయాణం చేశాడు. వందేభారత్ రైల్లో సెల్ఫీ కోసం మొత్తంగా బాగానే ఖర్చు చేశాడు. మరికొంత ఇంత కాస్టలీ సెల్ఫీ అవసరమా బ్రదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక ఫోటో జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదేనేమో కాబోలు దీన్ని చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి…

సంక్రాంతి కానుకగా వందే భారత్‌…

వివేక్ ఎక్స్‌ప్రెస్‌ దూరమెంతో తెలుసా…

ఆరోగ్యానికి అద్భుత వరం మిరియాలు..

- Advertisement -