అమెరికాలో ఖైదీలకు కరోనా…

224
america
- Advertisement -

కరోనా వైరస్‌తో అమెరికా గజగజ వణికిపోతోంది. 24 గంటల్లోనే 2,390 మందిని ఈ ప్రాణాంతక వైరస్ పొట్టనబెట్టుకుంది. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10,64,194కు చేరింది.

ఇక జైళ్ల‌లో ఉన్న ఖైదీల్లోనూ క‌రోనా తీవ్ర‌త పెరుగుతున్న‌ది. సుమారు 2 వేల మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ వెల్లడించింది. మొత్తం 2,700 మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా 2,000 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇక కరోనాతో ఇప్పటివరకు 60 వేల మందికిపైగా మృతిచెందారు. ఇంకా ల‌క్ష‌ల మంది బాధితులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -