- Advertisement -
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 21.82 లక్షలు దాటాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 5.47 లక్షల మంది కోలుకున్నారు. 1.45 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా బ్రిటన్‌లో మరో 3 వారాల పాటు మే 15 వరకు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరింది. ఇప్పటివరకు 1,515 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. 420 మంది కరోనాతో మృతిచెందారు.
తెలంగాణలో 700కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ కాగా, 18 మంది మృతిచెందారు.
ఏపీలో 534కు చేరిన కరోనా కేసులు. ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20కి చేరింది.
- Advertisement -