- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 70 వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 3, 788 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బుధవారం చికిత్స పొందుతూ 64 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 70, 390 కి చేరింది. మొత్తం ఇప్పటివరకు 41, 437 మంది కొలుకోగా 2, 365మంది మృతి చెందారు. ప్రస్తుతం 26, 588 యాక్టివ్ కేసుల ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -