సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్..

238
cisf jawans
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా మనదేశంలోనూ రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి చేరింది.

తాజాగా ఎయిర్ పోర్టులకు రక్షణ కల్పించే సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న జవాన్లు విదేశాల నుంచి వచ్చిన వారిని తనిఖీలు చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఎయిర్ పోర్టులో డ్యూటీ చేసిన 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను క్వారంటైన్ కు పంపింది.

క్వారంటైన్ లో ఉన్న నలుగురికి గురువారం పాజిటివ్ రాగా.. మిగతా ఏడుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలినట్లు సీఐఎస్ఎఫ్ ప్రకటించింది. ప్రయాణీకుల ఐడీ కార్డులను తాకడం, వాష్ రూమ్‌లలో నీళ్ల ట్యాప్‌లను ముట్టుకోవడం వల్ల వీరికి కోవిడ్ వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.

- Advertisement -