కాంగ్రెస్ టార్గెట్ పెద్దదే !

56
congress
- Advertisement -

కర్నాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ప్రస్తుతం కర్నాటకలోని పరిస్థితులన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడంతో విజయం తథ్యం అనే ధీమాతో ఉన్నారు హస్తం నేతలు. ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను ఫైనల్ చేసి ప్రచారంలో దూసుకుపోతుంది హస్తం పార్టీ. కర్నాటకలో బిజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక ఉంది. సి‌ఎం బసవరాజ్ పై అవినీతి ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. వీటన్నిటిని అనుకూలంగా మార్చుకున్న హస్తంపార్టీ.. కన్నడ ప్రజలు ఈసారి తమకే అధికారాన్ని కట్టబెడతారని ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి. .

కర్నాటక ప్రజలు ఏ పార్టీకి కూడా రెండవ సారి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ సారి బిజేపీ కష్టమే అనే వాదన వినిపిస్తోంది. ఇలా ఎటు చూసిన కాంగ్రెస్ కు అనుకూలతలే కనిపిస్తున్నాయి. దాంతో కర్నాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ భారీ టార్గెట్ నే పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 160 సీట్లు గెలవాలని, లేదంటే అధికారాన్ని బిజేపీ దొంగిలించే అవకాశం ఉందని కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే 160 సీట్లు గెలుచుకునే సత్తా కాంగ్రెస్ కు ఉందా ? అనే ఏమో చెప్పలేం అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. 224 సీట్లు ఉన్న కర్నాటకలో అధికారం చేజిక్కించుకోవాలంటే 113 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ ప్రస్తుతం బిజేపీ, కాంగ్రెస్ జేడీఎస్ మూడు ప్రధాన పార్టీలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెడితే మరికొన్ని హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎమ్మెల్యేలను కొనుక్కోవడంలో బిజేపీ ఏ మాత్రం వెనుకడుగు వేయదు. అందుకే కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే 160 సీట్లు కైవసం చేసుకోక తప్పదని రాహుల్ గాంధీ చెబుతున్నారు. కానీ ఆయా సర్వేలు, విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ కు 100-120 సీట్లు వచ్చే అవకాశం ఉందట. మరి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చిన బిజేపీతో కాంగ్రెస్ కు ముప్పే అనేది కొందరి అభిప్రాయం. అందుకే బిజేపీ కుయుక్తులకు అందకుండా ఉండాలంటే కాంగ్రెస్ నిర్దేశించుకున్న 160 సీట్లు కైవసం చేసుకోక తప్పదు. మరి భారీ టార్గెట్ పెట్టుకున్న హస్తం పార్టీ ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

Karnataka Elections:బీజేపీకి షాక్.. కోలుకోవడం కష్టమే !

Pawan:తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

జనసేనలో అంతర్మథనం.. అందుకే ఆ నిర్ణయం!

- Advertisement -