జర్నలిస్ట్ గా మాజీ హీరో

45
- Advertisement -

గ్రేట్ విజువల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రాబోతున్న సినిమా భారతీయుడు 2. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ సినిమా పై బాగా ఆసక్తి చూపిస్తుంది. అందుకే, మేకర్స్ కూడా ఈ సినిమాలో నటించే నటీనటులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడు అని మేకర్స్ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. నేడు సిద్ధార్థ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ లుక్ చాలా సింపుల్ గా ఉంది. మరి ఈ సినిమాలో సిద్ధార్థ్ ఏ పాత్రలో నటించబోతున్నాడో చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. సిద్ధార్థ్ ఓ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు.

భారతీయుడు చేసే పోరాటాన్ని తనదైన శైలిలో కవర్ చేస్తూ.. ఆ పాత్ర యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చెప్పే పాత్రలో సిద్ధార్థ్ కనిపించబోతున్నాడు. అయితే, సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ పాత్రను చంపుతారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ మాజీ లవర్ బాయ్ ఓ ట్రాజెడీ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఇండియన్ 2 కోసం కమల్ హాసన్ గ్యాప్ లేకుండా షూట్ లో పాల్గొంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ రెడ్ జెయింట్ మూవీస్ సహకారంతో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. మధ్యలో ఆగిపోయిన ఈ సినిమా మళ్లీ కమల్ హాసన్ ప్రమేయంతో మొదలు అయ్యింది. దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ కి మధ్యలో బ్రేక్ ఇచ్చి.. ఇండియన్ 2 పై కసరత్తులు చేస్తున్నాడు. కమల్ కెరీర్ కు ‘విక్రమ్’ రూపంలో భారీ బూస్టప్ వచ్చింది. ఆ ఊపే ఇండియన్ 2 కి కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి…

మెగాస్టార్ తో భారీ ఫాంటసీ డ్రామా

బన్నీ పోస్ట్ పై నాని ఫ్యాన్స్ ఫైర్

ఎన్టీఆర్ విలన్.. బాలీవుడ్ తట్టుకుంటుందా?

- Advertisement -