మోదీ దేశభక్తిని నిరూపించుకోవాలి: వీహెచ్‌

41
vh

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన దేశ భక్తి అంటే బీజేపీ అనేలా మోదీ ప్రవర్తిస్తున్నారని కానీ జాతీయ పతాకం తయారు చేసి వందేళ్లు అవుతోంది.. అయిన శతవార్షికోత్సవ వేడుకలు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు.

బీజేపీ పాలనలో దక్షిణాది నేతలు నిరాదరణకు గురవుతున్నారని మండిపడ్డ వీహెచ్‌..పార్లమెంట్ లో పింగళి వెంకయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.ఇప్పటికైన ప్రధాని మోదీ.. జాతీయ పతాకం, జాతీయ గీతం శతాధి ఉత్సవాలు నిర్వహించి దేశ భక్తి ని నిరూపించుకోవాలన్నారు. 11న పింగళి వెంకయ్య స్వంత గ్రామానికి వెళ్తానని చెప్పిన వీహెచ్‌.. బీజేపీ నేతలు తమ పద్దతిని మార్చుకోవాలని హితవు పలికారు.