లోకేశ్ ఓ మిడత: కొడాలి నాని

27
nani

టీడీపీ నేత లోకేశ్ ఓ మిడతలాంటోడని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన నాని.. కులాలు, మతాలు గురించి మాట్లాడటం బాబు దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు.

ముఖ్యమంత్రి,హోంమంత్రి,డీజీపీలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు. వాడుకోవడం, వదిలివేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ఆదరణతోనే సీఎం జగన్‌ ఈ స్థాయిలో ఉన్నారని తెలిపారు. జగన్‌ అంటే ఒక వ్యవస్థ. సంక్షేమ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు.